భద్రాద్రి జిల్లా బ్యూరో, ఫిబ్రవరి 10 (వార్త సంధ్య): భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఫిబ్రవరి 11వ తేదీ (బుధవారం) స్థానిక సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ ఉత్తర్వులు జారీ చేశారు.కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు ఇల్లందు, అశ్వారావుపేట మున్సిపాలిటీల పరిధిలో పోలింగ్ రోజున స్థానిక సెలవు పాటించాలని ఆదేశించారు. ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలు, సంబంధిత యాజమాన్యాలు ఈ ఉత్తర్వులను తప్పనిసరిగా అమలు చేయాలని కలెక్టర్ స్పష్టం చేశారు.అలాగే, అర్హులైన ప్రతి ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లు పూర్తయ్యాయని, జిల్లాలో 144వ సెక్షన్ అమల్లో ఉందని తెలిపారు. పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా, పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని చర్యలు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వెల్లడించారు
