కృష్ణాజిల్లా బ్యూరో, జనవరి 01 (వార్త సంధ్య):
ఎన్టీఆర్ జిల్లా పరిధిలోని జగ్గయ్యపేట నియోజకవర్గం, జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట గ్రామంలో నూతన సంవత్సరం–2026 సందర్భంగా ఆర్ఎస్ ట్రస్ట్ ఆధ్వర్యంలో సేవా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వంద మంది నిరుపేద వృద్ధ మహిళలకు చీరలు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో సభాధ్యక్షులు అన్నె పాగ దుర్గామహేశ్వరరావు మాట్లాడుతూ, తన వద్ద ఎక్కువ వనరులు లేకపోయినా ఉన్నంతలోనే సాటి మనిషికి సహాయం చేయాలనే సంకల్పంతో ఆర్ఎస్ ట్రస్ట్ ఈ కార్యక్రమాన్ని చేపట్టడం అభినందనీయమని అన్నారు. భవిష్యత్తులో కూడా ట్రస్ట్ ద్వారా మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టి నిరుపేదలు, అనాధలకు సహాయ సహకారాలు అందించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో పాల్గొన్న కారుపాటి డేవిడ్, అన్నె పాగ నరసింహారావు, మార్కపుడి వంశీ, చిలక నాగేశ్వరరావు, పాము సుధీర్ తదితరులు ఆర్ఎస్ ట్రస్ట్ సేవలను ప్రశంసిస్తూ తమ వంతు సహకారం అందిస్తామని తెలిపారు.మహిమగల ప్రార్థన మందిరం ఆవరణలో నూతన సంవత్సర కూడికను ఏర్పాటు చేసి, ఈ కార్యక్రమం విజయవంతం కావాలని దైవ సేవకులు డేవిడ్ రాహేలమ్మ ప్రార్థనలు నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ట్రస్ట్ చైర్మన్ అన్నె పాగ శ్రీనివాసరావు, వైస్ చైర్మన్ రాణి, సెక్రటరీ విజయరామరాజు, మాజీ ఎంపీటీసీ ఇదమ్మా, పద్మ, పెద్దలు గోపాల్ రావు, తిరపయ్య, దేవస్థానం బోర్డు సభ్యులు అంబోజి ముత్యాలరావు, పుల్లయ్య, దేవమణి, మాతంగి మణి, ముల్లంగి ఆసీస్, ముత్తమ్మ, షేక్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు.
