శుభాకాంక్షలు తెలిపిన పలువురు ప్రముఖులు
జగ్గయ్యపేట, జనవరి 01 (వార్త సంధ్య):
నూతన సంవత్సరం–2026 సందర్భంగా జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) నివాసం గురువారం ఉదయం నుంచే సందడిగా మారింది. కొత్త సంవత్సర ఆగమనాన్ని పురస్కరించుకుని ఎమ్మెల్యేకు శుభాకాంక్షలు తెలియజేయడానికి పలువురు ప్రజాప్రతినిధులు, అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య)కు పుష్పగుచ్ఛాలు అందజేసి, శాలువాలతో సత్కరించి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. పలువురు నేతలు ఎమ్మెల్యేతో ఆప్యాయంగా ముచ్చటించి, నియోజకవర్గ అభివృద్ధి, ప్రజా సంక్షేమ కార్యక్రమాలపై చర్చించారు.
మరోవైపు ఉదయం నుంచే వివిధ శాఖలకు చెందిన అధికారులు, కూటమి నాయకులు, కార్యకర్తలు, సానుభూతిపరులు ఎమ్మెల్యే నివాసానికి చేరుకుని వ్యక్తిగతంగా శుభాకాంక్షలు తెలిపారు. సందర్శకుల రాకతో ఎమ్మెల్యే నివాసం పండుగ వాతావరణాన్ని సంతరించుకుంది.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీరాం రాజగోపాల్ (తాతయ్య) వచ్చిన వారందరినీ చిరునవ్వుతో ఆహ్వానిస్తూ, ప్రతి ఒక్కరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. నూతన సంవత్సరం ప్రజలందరికీ ఆరోగ్యం, శాంతి, సుఖసంతోషాలు కలిగించాలని ఆయన ఆకాంక్షించారు.
