హైదరాబాద్, జనవరి 1 (వార్త సంధ్య):
నూతన సంవత్సరం సందర్భంగా ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి దంపతులకు వారి నివాసంలో శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి కార్యాలయ స్టాఫ్ సభ్యులు గోపాల్ , లోహిత్ , హరికృష్ణ , మధు సాగర్, కృష్ణ సాగర్ , శివ ఆయనను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు.
స్టాఫ్ సభ్యులు ఎమ్మెల్యే దంపతులకు పుష్పగుచ్ఛాలు అందజేసి, ఆరోగ్యం, ఆయురారోగ్యాలతో ప్రజాసేవలో మరింత ముందుకు సాగాలని ఆకాంక్షించారు. స్పందించిన ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి స్టాఫ్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు.
ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తామని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. నూతన సంవత్సరం అందరికీ శుభఫలితాలు అందించాలని ఆకాంక్షించారు.
