కొత్తగూడెం, జనవరి 12 (వార్త సంధ్య): సంక్రాంతి పండుగను పురస్కరించుకొని కొత్తగూడెం పట్టణంలోని ప్రకాశం స్టేడియంలో పొంగులేటి యూత్ ఆధ్వర్యంలో మహిళల కోసం భారీగా ముగ్గుల పోటీలను నిర్వహించనున్నారు. ఈ పోటీలు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానున్నాయి.ఈ సందర్భంగా ప్రకాశం స్టేడియాన్ని పొంగులేటి యూత్ సభ్యులు, అభిమానులు రంగురంగుల అలంకరణలతో సర్వాంగ సుందరంగా ముస్తాబు చేశారు. డివిజన్ల వారీగా 648 రిజిస్టర్ చేసుకోగా, నేరుగా అక్కడికి వచ్చే పోటీదారుల కోసం మరొక 50 బాక్సులు కేటాయించడం జరిగింది.మొత్తం 700 మంది మహిళలు పాల్గొనేలా నిర్వాహకులు ఏర్పాట్లు చేశారు.ఈ పోటీల్లో విజయం సాధించిన మహిళలకు రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మరియు ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రామసహాయం రఘురామిరెడ్డి చేతుల మీదుగా బహుమతులు అందజేయనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.బహుమతుల వివరాలు ప్రథమ బహుమతి రూ.30,000,ద్వితీయ బహుమతి రూ.25,000,తృతీయ బహుమతి రూ.20,000,నాలుగవ బహుమతి రూ.15,000,ఐదవ బహుమతి రూ.10,000.అదేవిధంగా ఐదుగురికి కన్సోలేషన్ బహుమతులుగా రూ.5,000 చొప్పున నగదు, అలాగే పోటీలో పాల్గొన్న ప్రతి మహిళకు ప్రోత్సాహక బహుమతులు అందించనున్నట్లు వారు పేర్కొన్నారు.
