కండువగట్టి కప్పి సాధారణంగా ఆహ్వానించిన మంత్రి పొంగులేటి
కొత్తగూడెం జనవరి 4 ( వార్త సంధ్య ) : తెలంగాణ రాష్ట్రంలో అమలవుతున్న ప్రజాపాలన, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై కొత్తగూడెం మాజీ కౌన్సిలర్స్ కనుకుంట్ల కుమార్ వెంకటరమణ దంపతులు, రేఖరాణి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర రెవిన్యూ, గృహ నిర్మాణ, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తోందని, రాష్ట్ర అభివృద్ధికి ప్రతి కార్యకర్త భాగస్వామి కావాలని మంత్రి పేర్కొన్నారు.కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర నాయకులు తూము చౌదరి రూపొందించిన వ్యూహం ఫలించిందని, స్థానిక స్థాయిలో పార్టీ మరింత బలోపేతం అవుతుందని నాయకులు విశ్వాసం వ్యక్తం చేశారు. కొత్తగా చేరిన నాయకులు పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కృషి చేస్తామని తెలిపారు.
