ముగ్గుల పోటీలో విజేతలకు బహుమతులు అందజేసిన ఎమ్మెల్యే సుదీర్ రెడ్డి
ఎల్బీనగర్, జనవరి 4 ( వార్త సంధ్య ): సంక్రాంతి పండుగ సంబరాల్లో భాగంగా గడ్డిఅన్నారం డివిజన్లోని వివేకానంద బస్ స్టాప్ వద్ద నిర్వహించిన ముగ్గుల పోటీలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమాన్ని డివిజన్ మాజీ కార్పొరేటర్ భవాని ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించగా, ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుదీర్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సుదీర్ రెడ్డి మాట్లాడుతూ తెలుగు రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజల జీవితాల్లో నిత్యం వెలుగులు విరిసిల్లుతూ ఆనందంగా జీవించాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా పండుగలు జరుపుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటా సుఖశాంతులు, సౌభ్రాతృత్వం, సౌభాగ్యం వెల్లివిరియాలని కోరారు.అనంతరం ముగ్గుల పోటీల్లో విజేతలుగా నిలిచిన వారికి బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బిచేనేపల్లి వెంకటేశ్వరరావు, రమేష్ ముదిరాజ్, డివిజన్ అధ్యక్షులు శ్రీశైలంయాదవ్, అలాగే రమణారెడ్డి, యాద శంకర్, ప్రతీక్, రవీందర్ రెడ్డి, వీక్కీ, ప్రదీప్, విజయలక్ష్మి, భాస్కర్, మోహన్, కృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. పెద్ద సంఖ్యలో మహిళలు, చిన్నారులు హాజరై పండుగ సంబరాలను మరింత ఉత్సాహంగా మార్చారు.
